గ్రేటర్ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరింది. బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఇవ్వాల కేంద్ర మంత్రి స్మృతి ఇరాని హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తున్నదన్నారు. రోజురోజుకూ టీఆర్ ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతున్నదన్నారు. ఓటమి భయంతోనే బీజేపీ నేతలపై అక్రమలు పెడుతున్నారని మండిపడ్డారు. దబ్బాకలో కూడా నానా యాగీ చేసిందన్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని అన్నారు. అక్రమ చొరబాటుదార్లకు ఎంఐఎం మద్దతు ఇస్తున్నా, టీఆర్ఎస్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. రోహింగ్యాలకు ఓటు హక్కు కల్పించాలని ఎంఐఎం లేఖలు రాసిందని అన్నారు. బీజేపీ విడుదల చేసిన చార్జిషీట్ పై టీఆర్ ఎస్ నుంచి ఎలాంటి సమాధానం లేదని అన్నారు.
హైదరాబాద్ నగరం వరదలతో విలవిలలాడిందని అన్నారు. ప్రజలు తమ ఆస్తులు కోల్పోయి రోడ్డున పడినట్లు చెప్పారు. 80 మంది ప్రజలు చనిపోయారని చెప్పారు. సుమారు 30వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని తెలిపారు. వరదల నష్టంపై టీఆర్ ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్రానికి ఎలాంటి నివేదిక అందజేయలేదన్నారు.