రాజస్తాన్ సంచలన తీర్పు… నాలుగేళ్ల బాలికపై అత్యాచారం కేసులో మరణ శిక్ష

-

రాజస్తాన్ స్పెషల్ కోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది. నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి దారుణంగా చంపిన నిందితుడికి మరణశిక్ష విధించింది. దీంతో పాటు రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సందీప్ కుమార్ శర్మ తీర్పు చెప్పారు. గతేడాది ఆగస్టులో సురేష్ కుమార్ బలాయ్(25) అనే యువకుడు నాలుగేళ్ల చిన్నారిని అపహరించి అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఈ ఘటన రాజస్తాన్ జైపూర్ రూరల్ పరిధిలోని నరేనా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా ఈ కేసును విచారించిన స్పెషల్ కోర్ట్ నిందితుడికి మరణశిక్ష విధించిదని.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహావీర్ సింగ్ కిష్టావత్ వెల్లడించారు. కోర్ట్ ముందు 41 మంది సాక్షులు కూడా సురేష్ కుమార్ బలాయ్ కి వ్యతిరేఖంగా సాక్షం చెప్పారని వెల్లడించాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే పోలీసులు కథనం ప్రకారం.. గతేడాది ఆగస్టు 12న తమ నాలుగేళ్ల కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదే సాయంత్రం ఓ చెరువు దగ్గర బాలిక మృతదేహాన్ని పోలీసులు కనుక్కున్నారు. పోస్ట్ మార్టంలో బాలిక పై అత్యాచారం చేశారని తేలింది. 15 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి సురేష్ కుమార్ బలాయ్ సెక్షన్ 366 (కిడ్నాప్), 302 కింద (హత్య), 201 (సాక్ష్యం అదృశ్యం కావడం), 376ఏబీ ( స్త్రీ పై అత్యాచారానికి పాల్పడటం), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఈ ఘటన సమయంలో ఎస్పీ జైపూర్ (రూరల్)గా శంకర్ దత్ శర్మ ఉన్నారు. అదనపు ఎస్పీ ధర్మేంద్ర కుమార్ యాదవ్ నేతృత్వంలో 700 మంది పోలీసులతో విచారణ కమిటీ( సిట్) ఏర్పాటు చేశారు. ఈ కేసులో కేవలం 8 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశామని ధర్్మేంద్ర కుమార్ అన్నారు. నిందితుడికి శిక్ష పడినందుకు సంతోషం వ్యక్త చేశారు. ఈకేసులో ప్రతీ క్లూను సేకరించామని.. నిందితుడిని 15 గంటల్లోనే పట్టుకున్నామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news