క్రైం బీట్ : ఏపీలో అత్యాచారాల‌కు కార‌ణం ఇదే!

-

మంచి, మర్యాద, సోదరాభిమానం ఉన్న ఆంధ్రప్రదేశ్ మనుషులకు ఇప్పుడు ఏమైంది..రాను రాను రాక్షసులుగా మారుతున్నా రు..కామ వాంఛ‌ల‌తో కళ్లూ, ఒళ్లూ తెలియకుండా అమ్మాయిల పై లైంగిక దాడులు చేస్తున్నారు..ఒక ఘటన గురించి పూర్తిగా మర్చిపోక ముందే మరో ఘటన వెలుగులోకి వస్తుంది. పల్నాడు జిల్లాలోని గురజాల రైల్వే స్టేషన్ సమీపంలో ఒడిశాకు చెందిన ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఏప్రిల్ 16న ఈ ఘటనపై కేసు నమోదయ్యింది.

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓ వివాహిత హత్యకు గురయింది. గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఆమెతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి హత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్థారించారు. ఈ ఘటన ఏప్రిల్ 27న జరిగింది.బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో వలస కూలీ కుటుంబంపై దాడి చేసి, ఆ కుటుంబానికి చెందిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ సహా పలువురు నేత‌లు స్పందించారు. ఏప్రిల్ 30న ఈ ఘటన జరిగింది..ఆ ఘటన జరిగిన 15 రోజుల లోనే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసు స్టేషన్‌ల పరిధిలో సామూహిక అత్యాచారాల కేసుల వివరాలు పరిశీలిస్తే ఈ కేసులు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది.

2019లో కరోనావైరస్ వ్యాప్తి కారణంగా సంపూర్ణ లాక్‌డౌన్ అమలుచేశారు. 2020లోనూ లాక్‌డౌన్‌ అమలు చేశారు. 2020, 21 సంవత్సరాల్లో ఏప్రిల్ మాసంలో గ్యాంగ్ రేప్ లకు సంబంధించి కేవలం రెండేసి కేసులు మాత్రమే ఈ జిల్లాల పరిధిలో నమోదయ్యా యి. 2020కి వచ్చేసరికి ఈ కేసులు 1090కి పెరిగాయి. బాధిత మహిళలు 1107 మంది ఉన్నారు.. అలా ఏటా పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని ఘటనలు రాజకీయ దుమారం కూడా లేపాయి.. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్నో కఠిన చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.

ప్రభుత్వ పెద్ద‌లు, పోలీసులు ఈ ఘటనల పై వెంటనే స్పందించి పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రతిపక్ష నేతలు కూడా దుమ్మెత్తి పొస్తున్నారు. ఇక ఈ విషయం పై అధికార ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. వీట‌న్నింటికీ కార‌ణం నిఘా వైఫ‌ల్యం, పాల‌న‌పై ప‌ట్టులేకపోవ‌డం వీటితో పాటు స్థానిక నాయ‌క‌త్వాల పెత్త‌నం అన్న‌వి సుస్ప‌ష్టం అవుతున్న విష‌యాలు అని విప‌క్షం గ‌గ్గోలు పెడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news