సంచలన తీర్పు ఇచ్చిన చిత్తూరు కోర్ట్…!

-

గత ఏడాది నవంబర్ 7 న చిత్తూరు జిల్లాలో జరిగిన అత్యాచారానికి సంబంధించి చిత్తూరు జిల్లా కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి పెళ్ళికి వెళ్ళిన ఒక ఆరేళ్ళ చిన్నారి పై మహ్మద్ రఫీ అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసాడు. ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్తూరు పోలీసులు వేగంగా విచారణ పూర్తి చేసారు. కోర్ట్ ఆదేశాలతో ప్రతీ ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి రఫీ ని దోషిగా తేల్చారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు పోలీసులు. పోక్సో చట్టం కింద ఉరి శిక్ష పడిన తొలి కేసు ఇదే కావడం విశేషం. దీనిపై ఇప్పటికే వాదనలు విన్న చిత్తూరు జిల్లా కోర్ట్… సోమవారం తీర్పు ఇచ్చింది. నిందితుడుని జైలుకి తీసుకువెళ్ళిన వెంటనే చివరి కోరిక ఏమైనా ఉందా అని అడిగిన న్యాయవాది నేరం రుజువు అయింది అన్నారు. తనకు ఈ నేరం తో సంబంధం లేదని రఫీ కోర్ట్ లో వాపోవడం గమనార్హం.

నవంబర్ 7 న కురుబుల కోట మండలం చేనేత నగర్ లో ఈ ఘటన జరిగింది. దీనిపై అప్పుడు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసాయి. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ పూర్తి చేసారు. ఈ తీర్పుని హైకోర్ట్ కి పంపుతున్నామని న్యాయవాది తెలిపారు. దీనిపై బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. నిందితుడికి త్వరగా ఉరి శిక్ష అమలు చెయ్యాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news