అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. నమస్తే అంటూ ప్రసంగం మొదలుపెట్టిన ట్రంప్… కీలక వ్యాఖ్యలు చేసారు. మోడీ హయాం లో అద్భుతమైన అభివృద్ధి జరిగింది అన్నారు. భారత్ మానత్వానికి ప్రతీక అన్నారు. భారత్ కి ఉన్న శక్తి సామర్ధ్యాలు వెలకట్టలేనివి అన్నారు ఆయన. భారత్ అభివృద్దిని చూసి అమెరికా గర్విస్తుంది అన్నారు ట్రంప్. ఏటా 2 వేల సినిమాలు నిర్మించే సామర్ధ్యం భారత్ కి ఉందన్నారు.
ఉగ్రవాద౦ విషయంలో భారత్, అమెరికా సిద్దాంతం ఒకటే అన్నారు. భారత్ ఎన్నో రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తుంది అన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాద౦ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తామన్నారు. భారత పర్యటన కొత్త అవకాశాలను సృష్టిస్తుంది అన్నారు ట్రంప్. భారత్ అమెరికా సహజంగానే స్నేహితులు అని కొనియాడారు. రెండు దేశాల మధ్య డిజిటల్ అందం బలపడుతుంది అన్నారు అగ్ర రాజ్య అధినేత.
దేశ అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారన్న ఆయన… పారిశ్రామికంగా ఉన్నతంగా ఎదుగుతున్నారని కొనియాడారు. గొప్ప ప్రగతిని సాధిస్తున్నారని.. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. పురుషులూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యసంబంధాలను గురించి మాట్లాడిన ట్రంప్… దక్షిణాసియాలో భారత్ కీలకపాత్ర పోషిస్తుందని అని అన్నారు. రెండు దేశాల మధ్య 40శాతం వాణిజ్యం పెరిగిందని.. ఎగుమతులు, దిగుమతలు వృద్ధి పథంలో ఉన్నాయన్నారు.