అతి వేగం ఆరుగురిని బలిగొంది. గుజరాత్ ఆనంద్ జిల్లా సోజిత్రా గ్రామం దగ్గరలో గురువారం సాయంత్రం జరిగిందీ ఘటన. ఆనంద్, తారాపుర్ను కలిపే రాష్ట్ర రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ ఎస్యూవీ.. ఆటోను, బైక్‌ను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న నలుగురు, బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. చికిత్స కోసమని ఓ ఆస్పత్రిలో చేరాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతులంతా సోజిత్రా, బొరియావీ గ్రామాల ప్రజలని నిర్ధరించారు. గుజరాత్లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడైన కేతన్ పదియార్.. ఎస్‌యూవీని వేగంగా నడిపి ఈ ప్రమాదానికి కారణమయ్యాడని ప్రాథమికంగా తేల్చారు. కాసేపటికే కేతన్‌ను అరెస్టు చేశారు. ఆరుగురు మరణానికి కారణమయ్యాడని ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అల్లుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.