సోదర, సోదరీమణుల బంధానికి ప్రతీక రక్షాబంధన్‌ : మంత్రి సబితా

-

దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సొదర సోదరీమణులు రక్షా బంధన్‌ వేడుకను జరుపుకుంటున్నారు. అయితే.. అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల ఆత్మీయ అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీక అని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరుడు నరసింహారెడ్డి ఇంటికెళ్లి మంత్రి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అక్కా, తమ్ముళ్ల, అన్నా,చెల్లెళ్ల వెల కట్టలేని ఆప్యాయతలు, అనురాగాలకు ఈ పండుగ నిలువెత్తు నిదర్శనమన్నారు.

Minister Sabitha Indra Reddy falls sick, admitted to hospital in Hyderabad

రక్షా బంధన్‌ను కుటుంబసభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి సూచించారు. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జాతీయ సమైఖ్య రక్షా బంధన్ వేడుకల్లో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కోరారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news