తమిళనాడు ‘పరువు’ హత్య..కన్న కూతురిని చంపిన తల్లి

తమిళనాడు ‘పరువు’ హత్య జరిగింది. తమిళనాడులో కన్న కూతుర్ని చంపింది ఓ కసాయి తల్లి. వేరే కులం వారిని ప్రేమించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరునల్వేలి జిల్లా సివల్పేరి గ్రామంలో ఘటన జరిగింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, ఆరుముగ కని, పిచ్చయ్ ల కుమార్తె అరుణ. స్ధానికంగా అరుణ… నర్సింగ్ చదువుతోంది.

అయితే, స్ధానికంగా నివాసం ఉంటున్న రజనీ అనే యువకుడ్ని ప్రేమించింది అరుణ. ఈ విషయం తెలిసిన అరుణ తల్లి.. వేరే కులం వ్యక్తితో ప్రేమా వద్దుంటూ హెచ్చరించింది. ప్రేమించి కూడా మన కులం వాడినే ప్రేమించాలని పేర్కొంది తల్లి ఆరుముగ కనీ.

ఇక కుమార్తెకి అకస్మాత్తుగా పెళ్ళి చూపులు ఏర్పాటు చేసింది. అయితే, పెళ్ళి చూపుల సమయంలో ప్రేమా వ్యవహారం చెప్పింది కుమార్తె. దీంతో ఆగ్రహంతో కుమార్తె అరుణారుణ చంపింది తల్లి. అనంతరం హెయిర్ డై పౌడర్ తాగిని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.