తనతో ఎఫైర్ కంటిన్యూ చేయలేదని.. మహిళ కొడుకును చంపిన టీచర్

-

తనతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడంలేదని కోపోద్రిక్తుడైన ఓ ఉపాధ్యాయుడు తన సహోద్యోగినిపై కక్ష పెంచుకున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న ఆమె కుమారుడిని దారుణంగా కొట్టి భవనంపై నుంచి కిందపడేశాడు. అడ్డొచ్చిన ఆమెను గోడకేసి బాదాడు. కుమారుడు చికిత్స పొందుతూ మరణించగా.. బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ దారుణం కర్ణాటకలోని గడగ్ జిల్లాలో చోటుచేసుకుంది.

death
death

గడగ్ జిల్లాలోని ఓ పాఠశాలలో ముత్తప్ప అనే వ్యక్తి కాంట్రాక్ట్ టీచర్ గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న సహోద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల ఆమె మరో ఉపాధ్యాయుడితో చనువుగా ఉండటాన్ని గమనించిన ముత్తప్ప ఆమెను మందలించాడు. అయినా ఆమె వినకపోవడంతో ఆమెపై కోపాన్ని ఆమె కుమారుడిపై చూపించాడు.

అదే పాఠశాలలో చదువుతున్న మహిళ కుమారుడిని దారుణంగా కొట్టాడు. అతడి అరుపులు విన్న ఆమె అక్కడికి వెళ్లి ఆపడానికి ప్రయత్నించగా ఆమెను గోడకేసి బాదాడు. అనంతరం ఆ బాలుడిని భవనంపై నుంచి కిందకు తోసి హత్య చేశాడు. గమనించిన తోటి సిబ్బంది ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముత్తప్పను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news