పెళ్లి చేసుకుంటానని నమ్మించి నర్స్ పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ డాక్టర్ పై నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది నర్స్. 2015 నుంచి హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా చేస్తున్న బాధిత యువతి 2019లో అదే హాస్పిటల్లో డాక్టర్ గా జాయిన్ అయిన కొట్టం సందీప్ భరద్వాజ్ కి మధ్య స్నేహం ఏర్పడింది. కులం, మతం, ఆస్తితో సంబంధం లేదంటూ మాయమాటలతో లొంగదీసుకుని నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు 2020 ఫిబ్రవరి 16 ,17 న యువతిపై రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు సందీప్.
తీవ్ర రక్తస్రావమవుటంతో వారం రోజులు తన ఇంట్లోనే ఉంచుకొని ట్రీట్మెంట్ చేయించాడు డాక్టర్ సందీప్.ఆ తర్వాత పలుమార్లు ప్రేమ పేరుతో లైంగిక వాంఛ తీర్చుకున్నాడు డాక్టర్ సందీప్ భరద్వాజ్. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ఇంట్లో మాట్లాడి చెబుతానంటూ యువతిని సొంత గ్రామానికి పంపించాడు డాక్టర్. యువతి హైదరాబాద్ వచ్చి పెళ్లి పై ఒత్తిడి తేవడంతో యువతిని కులం పేరుతో దూషించి కొట్టాడు డాక్టర్ సందీప్.
ఇంట్లో అడిగిన కట్నం ఇవ్వలేవంటు పెళ్లికి నిరాకరించాడు. 10.8.2022 న యువతి చీటింగ్, రేప్ కేస్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు పెట్టింది యువతి. కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.