దిల్లీలో ఘోరం.. ‘ఆపరేషన్‌ పేరుతో అవయవాలు తీసేసి ప్లాస్టిక్‌ కవర్లు కుట్టేసిన డాక్టర్లు’

-

నేర రాజధాని దిల్లీలో.. ఎక్కడో ఒక మూల ఏదో ఒక నేరం జరుగుతూనే ఉంటుంది. అత్యాచారాలు, హత్యలు మాత్రమే అనుకుంటే.. ఇప్పుడు వైద్యులు కూడా నేరగాళ్లుగా మారారు.. అనారోగ్యంతో బాధపడుతున్న కూతుర్ని ఆసుపత్రికి తీసుకొచ్చాడు ఓ తండ్రి.. ఆపరేషన్ పేరుతో డాక్టర్లు తమ బిడ్డ అవయవాలు దొంగలించారని శరీరంలో ప్లాస్టిక్‌ కవర్లు పెట్టి కుట్టేసి మృతదేహాన్ని అప్పగించారని ఆ తండ్రి బోరున విలపిస్తున్నాడు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
దిల్లీలో డాక్టర్లు చేసిన ఘోరానికి 15 ఏళ్ల తమ కూతురు చనిపోయింది అంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో బాధపడే తమ కూతుర్ని హాస్పిటల్‌కు తీసుకొస్తే ఆపరేషన్ పేరుతో డాక్టర్లు తమ బిడ్డ అవయవాలు దొంగిలించి శరీరంలో ప్లాస్టిక్ కవర్లు పెట్టి కుట్టేసి మృతదేహాన్ని తమకు అప్పగించారని కన్నీరుగా ఏన్నీరు ముడుస్తు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాలిక మృతదేహాన్ని తమకు అప్పగించాక అంత్యక్రియలు చేస్తుంటే శరీరం నిండా సర్జరీ జరిగినట్లుగా కుట్లు ఉన్నాయని..గాయాల్లోనుంచి పాలిథిన్ బ్యాగులు కనిపించాయని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక మృతదేహానికి మంగళవారం జనవరి 31,2023న నాడు పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. దీనికి సంబంధించి రిపోర్టు వచ్చాక తదపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు..
అపెండిసైటిస్‌కు నొప్పితో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు జనవరి 21న ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. 24న బాలికకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. 26న బాలిక చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. బాలిక శరీరాన్ని పలుచోట్ల ఆపరేషన్ చేసిన గాయాలు, వాటిలో పాలిథిన్ బ్యాగులు కనిపించడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది.. ఆపరేషన్ పేరుతో తమ కూతురు అవయవాలను తీసుకున్నారని ఆసుపత్రి యాజమాన్యంపై కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాట్లాడుతూ.. బాలిక మృతదేహాన్ని జనవరి 31న పోస్ట్‌మార్టం జరిపించారు.. ఆ రిపోర్టు వస్తే బాలిక మరణానికి కారణమేంటనేది తెలుస్తుందని ఆ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...