భార్యను చంపి పోలీసులకు ఫోన్‌ చేసిన భర్త..!!

దేశ రాజధాని దిల్లీ..క్రైమ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది..మొన్నటికి మొన్న పెళ్లి చేసుకోమనన్న పాపానికి ఓ యువతిని చంపి ముక్కులు ముక్కులుగా చేసి పారేశాడు ఓ యువకుడి.. ఆ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే ఇంకో ఘటన వెలుగుచూసింది. ఢిల్లీలో ఓ వ్యక్తి భార్యను హత్య చేసి పోలీసులకే ఫోన్ చేశాడు. తానే చంపినట్టు కాల్‌లో చెప్పాడు.. ఢిల్లీలోని హర్ష్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 35 సంవత్సరాల ఓ వ్యక్తి.. తన భార్యను గొంతు నులిమి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

యోగేశ్ కుమార్ అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని హర్ష్ విహార్ పోలీస్ స్టేషన్‍కు కాల్ చేశాడు. తన భార్యను హత్య చేశానని చెప్పాడు. సుశీలా గార్డెన్‍లోని ఇంట్లో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పాడు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. అప్పుడు యోగేశ్ భార్య అర్చనా స్పృహ కోల్పోయి ఉంది. పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఆదివారం జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కారణం ఏంటంటే..

భార్యను హత్య చేసినట్టు అంగీకరించిన యోగేశ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. యోగేశ్ కుటుంబం కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రాథమిక విచారణలో పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అర్చనా.. చాలా చోట్ల అప్పులు చేసిందని గుర్తించారు. ఈ విషయంలోనే ఆదివారం రోజున యోగేశ్, అర్చన మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. గొడవ పెద్దదైంది.. అర్చన గొంతును యోగేశ్ నులిమాడు. దీంతో ఆమె మృతి చెందింది. చనిపోయింది అని తెలుసుకున్న యోగేశ్‌ పోలీసులకు ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పాడు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మొన్నటికి మొన్న కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని…తండ్రి తుపాకీతో చంపి సూట్‌కేసులో కుక్కి.. మథుర సమీపంలోని యుమానా ఎక్స్ ప్రెస్ వే పక్కన పడేశాడు. ఈ కేసును ఛేదించిన ఉత్తర ప్రదేశ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.