ప్రేమలో పడి ఇంటి నుంచి వెళ్లిన మైనర్లు.. ఆ విషయమై ఫోన్ చేశారు.. చివరికి ఏమైందంటే?

ప్రేమ అనేది ప్రజెంట్ డేస్‌లో పిల్లలకూ త్వరగానే తెలిసిపోతున్నది. ఇందుకు స్మార్ట్ ఫోన్లు కూడా ఓ కారణమే. ఎందుకంటే పిల్లలూ పెద్దలతో సమానంగా ఇప్పుడు విరివిగా ఫోన్లు యూజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు మైనర్లు ప్రేమ పేరు చెప్పుకుని ఇంటి నుంచి పారిపోయారు. కాగా, ఓ సిల్లీ విషయమై ఇంటికి ఫోన్ చేయగా, వారిని పోలీసులు పట్టుకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

ఉత్తరప్రదేశ్‌ స్టేట్‌లోని చంబల్ ప్రాంతంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అరవింద్ కొడుకుకు 16 ఏళ్లు. స్థానికంగా ఉండే ఓ స్కూల్‌లో ఈ బాలుడు చదువుతున్న క్రమంలో తన క్లాస్‌లో ఉండే బాలికతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇద్దరు కలిసి చంబల్ నుంచి గోవా స్టేట్‌కు వెళ్లారు. అక్కడ ఫుట్‌పాత్‌పైనే రెండ్రోజులు ఉన్నారు. ఏదైనా హోటల్‌కు వెళ్దామని అక్కడికి వెళ్లగా, ఏదైనా ఐడీ కార్డు ఇవ్వాలని నిర్వాహకులు కోరారు.

వారిరువురు మైనర్లు కావడంతో వారి వద్ద ఎలాంటి ఐడీ కార్డ్స్ లేవు. కాగా, బయట ఫుట్ పాత్‌పైనే ఉండటం ఇష్టం లేక ఎలాగైనా హోటల్‌లో ఉండాలనుకున్నారు. ఈ నేపథ్యంలో బాలిక తన తండ్రికి ఫోన్ చేసి ఆధార్ కార్డు పంపాలని కోరింది. అయితే, అప్పటికే బాలిక తండ్రి బాలుడి తల్లిదండ్రులపైన పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో బాలుడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక బాలిక ఫోన్‌తో అలర్ట్ అయిన పోలీసులు మైనర్ల జాడ కనుగొనేందుకుగాను యూపీ పోలీసులు గోవా పోలీసులను సంప్రదించారు. గోవా పోలీసులు ఇద్దరు మైనర్ల అడ్రస్ కనుక్కొని యూపీ పోలీసులకు సమాచారమందించగా, వారు వచ్చి మైనర్లను చంబల్ తీసుకెళ్లారు. ఇక బాలిక దొరకిన సందర్భగా పోలీసులు బాలుడి తల్లిదండ్రులను విడుదల చేశారు.