భారత్, పాక్ మధ్య వైరం ఇప్పటిది కాదు.. ఇండియా విభజన జరిగినప్పటి నుంచి ఇదే కథ. భారత్ మీద ఎప్పుడూ ఏదో ఒకవిధంగా విషం చిమ్మడమే పాకిస్థాన్ పని. భారత్ అభివృద్ధి చెందితే చూస్తూ ఓర్వలేదు పాకిస్థాన్. అందుకే ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ పైకి ఉసికొల్పుతోంది. పాకిస్థాన్ తో పోరులో రోజూ ఎంతో మంది జవాన్లు తమ ప్రాణాలను అర్పిస్తున్నారు. భారత్ పై ఎన్నోసార్లు ఉగ్రదాడి కూడా చేసింది. ఇప్పటికీ భారత్ ను నాశనం చేయడమే పాకిస్థాన్ పని.
ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా. అంతా సోషల్ మీడియా రాజ్యమే కదా. అందుకే రాజకీయ పార్టీలు ఒకరిని మరొకరు సోషల్ మీడియాలో తిట్టుకున్నట్టు పాకిస్థాన్ సోషల్ మీడియాలో భారత్ ను బదనాం చేస్తోంది. నెటిజన్లలో తప్పుడు సంకేతాలను తీసుకెళ్తోంది. ఇది పాకిస్థాన్ నేషనల్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ సాక్షిగా జరిగింది.
India under Hindu Zionists has become a savage fascist state….with NO law but mob justice on streets driven by Hindu zealots.
This is Indian city of Jhansi, where Hindu mobs are lynching Muslims on streets & you can see the Police doing nothing in fear of RSS. #GhazwaEHind pic.twitter.com/lPF4jzQAqE— Zaid Hamid (@ZaidZamanHamid) October 3, 2018
ఇటీవల హైదరాబాద్ లోని అత్తాపూర్ లో జరిగిన హత్యను తప్పుగా చిత్రీకరించాడు ఆ వ్యక్తి. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఇండియాలో మతకలహాలను సృష్టించాలని ప్రయత్నించాడు. ఛీప్ ట్రిక్స్ చేయబోయాడు. కానీ.. నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయాడు. హిందూ గుంపు ఓ ముస్లిం వ్యక్తిని చంపుతున్నారంటూ సృష్టించాడు. అది కూడా ఉత్తర ప్రదేశ్ లోని జాన్సీ అనే ఊర్లో అంటూ ట్వీట్ చేశాడు. హిందువుల చేతిలో ఇండియా బంధీ అయిపోయిందని.. అక్కడ చట్టాలేవీ పని చేయవని.. రోడ్ల మీదే హిందూ గుంపులు తీర్పులిస్తున్నాయని… ఆర్ఎస్ఎస్ కు బయపడి పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారంటూ ఏది పడితే అది ట్వీట్ చేశాడు. అంతర్జాతీయంగా ఇండియాను బదనాం చేయడమే పాకిస్థానీయుల పని కదా.. ఆ విషయం ప్రపంచమంతా తెలుసు.
పాకిస్థాన్ దుష్ట బుద్ధిని కనిపెట్టిన కొంతమంది నెటిజన్లు… ఆ మర్డర్ జరిగింది జాన్సీలో కాదని.. అది హైదరాబాద్ లో జరిగిందని.. జాత్యహంకార హత్య కదు.. మత కల్లోలం కాదు.. మతహంకార హత్య కాదు.. వాళ్లిద్దరూ హిందువులే. వ్యక్తిగత గొడవల వల్ల జరిగిన హత్య ఇది అంటూ ఆ ట్వీట్ కు రిప్లయి ఇచ్చినా కూడా ఆ వ్యక్తి ఆ ట్వీట్ కే కట్టుబడి ఉన్నాడు. కొంతమంది పాకిస్థానీయులు కూడా ఆ ట్వీట్ ఫేక్ అంటూ రిప్లయి ఇచ్చారు. అత్తాపూర్ మర్డర్ కు సంబంధించిన కొన్ని లింకులను కూడా ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియా సాక్షిగా పాకిస్థాన్ ఇజ్జత్ తీసుకున్నారు వాళ్లు.