నల్లగా ఉన్నావని భర్త వెక్కిరించడంతో గొడ్డలితో నరికి చంపిన భార్య..

మనలో లోపాన్ని ఎవరైనా పదే పదే ఎత్తిచూపితే మనకు చాలా కోపం వస్తుంది. కాకపోతే ఆ క్షణం వరకే ఆ కోపం ఉంటుంది.. ఆ తర్వాత సదా మామూలే.. సరిదిద్దుకునే లోపాలు అయితే మనం చేయగలుగుతాం.. కానీ సరిదిద్దుకోని లోపాలు ఉంటే ఎవరో ఒకరూ ఎప్పుడూ ఆ లోపం చూపించి ఏడిపిస్తుంటే..ఇక్కడ నల్లగా ఉన్నావు అని భర్త తన భార్యను రోజూ వెక్కిరించే వాడట.. ఆమెకు కోపం వచ్చి గొడ్డలితో నరికి చంపేసింది..మీరు విన్నది నిజమే..!

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లా అమ్లేశ్వర్ గ్రామంలో ఉండే అనంత్ సోన్వానీని ఆయన భార్య సంగీత సోన్వానీ హత్య చేసింది. అనంత్ సోన్వానీకి సంగీత రెండో భార్య. మొదటి భార్య చనిపోయిన తరువాత సంగీతను పెళ్లి చేసుకున్నాడు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. భార్యను అందంగా లేవని, నల్లగా ఉన్నావని తరచూ తిడుతుండేవాడు అనంత్ సోన్వానీ. ఆదివారం రాత్రి కూడా భార్య భర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది.

ఆ సమయంలో, అనంత్ మళ్లీ ఆమె శరీర రంగు గురించి తీశాడు. దాంతో, తీవ్ర ఆగ్రహానికి లోనైన సంగీత ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్తను నరికేసింది. ఆగ్రహం చల్లారక, అతడి మర్మావయవాలను కూడా నరికేసింది. దాంతో, అనంత్ సోన్వానీ అక్కడికక్కడే చనిపోయాడు. మర్నాడు ఉదయం రాత్రి వేరే ఎవరో వచ్చి తన భర్తను హతమార్చారని ఇరుగుపొరుగుకు చెప్పి సీన్‌ మార్చే ప్రయత్నం చేసింది.. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. అనంతరం, సంగీత సోన్వానీని విచారించగా, అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

కోపంలో ఉన్నప్పుడు మనిషి ఆలోచన శక్తిని కోల్పోతాడు..అప్పుడు తీసుకునే నిర్ణయాలు అస్సలు మంచిచేయవు..సంగీత చేసిన పనిని మీరు సమర్థిస్తారా..? ఆమె చేసింది తప్పై ఉండొచ్చు..కానీ ఎప్పుడు ఎదుటి వ్యక్తిని బాడీ షేమింగ్‌ చేయకూడదు. వాళ్లు కావాలని అలా ఉండరు కదా..ఒకవేళ ఉన్నా అది వారి ఇష్టం..లావుగా ఉన్నాం, సన్నగా అయిపోతున్నాం, నల్లగా అయ్యావు ఇలాంటి చెప్పడం మానాలి! మీకు ఇలా చెప్పే అలవాటు ఉంటే జాగ్రత్త..!!