అల్లావుద్దీన్ దీపం భూతం పేరుతో మ‌హిళ‌కు రూ.73 ల‌క్ష‌ల మేర టోపీ..!

Join Our Community
follow manalokam on social media

అల్లావుద్దీన్ అద్భుత దీపం అన్న‌ది క‌ల్పిత క‌థ‌. అందులో అల్లావుద్దీన్‌కు దీపం దొర‌క‌డం, భూతం ప్ర‌త్య‌క్ష‌మై కోరుకున్న‌వి క్ష‌ణాల్లో ఇవ్వ‌డం.. అంతా క‌ల్పిత‌మే. అయిన‌ప్ప‌టికీ అది నిజంగా ఉంద‌నుకుని కొంద‌రు మోస‌పోతూనే ఉన్నారు. తాజాగా కువైట్‌లోనూ ఇలాంటి ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే…

woman lost rs 73 lakhs for alladdin jinn

కువైట్‌కు చెందిన 37 ఏళ్ల ఓ మ‌హిళకు దీపంలోని జిన్ ఆవ‌హించింద‌ని ఆమెకు చెందిన ఇద్ద‌రు స్నేహితురాళ్లు చెప్పారు. దీంతో ఆమె న‌మ్మింది. ఈ క్ర‌మంలో ఆ ఇద్ద‌రు మ‌హిళ‌లు ఆమెను ఓ తాంత్రికుడి వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌గా అత‌ను జిన్‌ను వ‌దిలిస్తాన‌ని చెప్పి పూజ‌లు చేశాడు. త‌రువాత ఆమె నుంచి 30వేల దినార్ల‌ను (దాదాపుగా రూ.73 ల‌క్ష‌లు) ఫీజుగా తీసుకున్నాడు. అయితే ఆ పూజ‌లు చేశాక వారి వ్య‌వ‌హార శైలి చూసి అనుమానం వ‌చ్చిన ఆ మహిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

కాగా భార‌త్‌లోనూ ఇలాంటి ఓ సంఘ‌ట‌న ఇటీవ‌ల చోటు చేసుకుంది. లండ‌న్ నుంచి వ‌చ్చిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ ఓ డాక్ట‌ర్ కు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంద‌ని, బ‌య‌ట‌కు తీస్తామ‌‌ని చెప్పి కొంద‌రు మోసం చేశారు. అత‌ని నుంచి రూ.2.50 ల‌క్ష‌లు తీసుకుని ఉడాయించారు. ఈ త‌ర‌హా సంఘ‌ట‌న‌లు ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...