నువ్వు కూడా మరొకరితో సహజీవనం చెయ్

-

న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళ పట్ల కొందరు పోలీసులు అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారని ఓ మహిళా ప్రతినిధి డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు.ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలోని ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లాలో పోలీసులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కాన్ఫరెన్స్లో విజయవాడకు చెందిన వాసవ్య మహిళా మండలి ప్రతినిధి బొల్లినేని కీర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలను డీజీపీ దృష్టికి తీసుకు వచ్చారు.

సమస్యతో మహిళా బాధితులు పోలీసుల వద్దకు వస్తే దాన్ని పరిష్కరించాల్సి ఉంది పోయి మరింత పెంచుతున్నారని ఆరోపించారు. తనను పట్టించుకోకుండా పొరుగు వీధిలో ఇంకొకరి తో సహజీవనం చేస్తున్న భర్తని పై చర్యలు తీసుకోవాలని ఒక మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులను కోరింది. నువ్వు కూడా మరొకరితో సహజీవనం చేయొచ్చుగా… అంటూ పోలీసులు ఎగతాళిగా మాట్లాడారని. మరొక మహిళ భర్తతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందిని వివరించి సహాయం చేయాలని కోరగా… ఇదేమైనా మీ పుట్టిల్లా అంటూ పోలీసులు ఎద్దేవా చేశారు. అని పోలీసు బాసు గౌతమ్ సవాంగ్ కు మహిళా ప్రతినిధి వివరించారు.

ఈ సందర్భంగా కొందరు పోలీసులు తీరు గురించి కీర్తి డిజిపికి వివరించారు. అభియోగం పై అరెస్టు చేసి తీసుకు వచ్చిన మహిళలను కొన్ని చోట్ల కొడుతున్నారని వారిని బాధితులుగా చూడాలని చట్టం చెబుతున్న విషయం సిబ్బందికి తెలియజేయాలని డీజీపీని కోరారు. మహిళా ప్రతినిధి కీర్తి చెప్పిన విషయాలను గౌతమ్ సవాంగ్ కు సావధానంగా విన్నారు.మరోసారి తెలుగులో ఆమెతోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో ని అధికారులకు వివరించారు. అనంతరం ఇలాంటివి పునరావృతం కాకూడదని పోలీసు అధికారులను డిజిపి హెచ్చరించారు. బాధిత మహిళలకు పోలీస్ స్టేషన్ అండగా నిలిచే పుట్టినిల్లు లేనని స్పష్టం చేశారు. ఏ ఇబ్బంది వచ్చినా పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు సంప్రదించవచ్చని బాధితులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news