మంచి చేయబోతే.. చెడు ఎదురైందట.. ఈ సామెత వినే ఉంటారు.. అలాంటి ఘటనే ఇది.. హైదరాబాద్ లో తిలక్, ప్రమీల (పేర్లు మార్చాము) భార్యాభర్తలు నివసిస్తున్నారు. తిలక్ జాబ్ చేస్తుంటే.. ప్రమీల గవర్నమెంట్ జాబ్ కోసం సన్నద్ధం అవుతోంది. అయితే.. ప్రమీలకు ఫేస్ బుక్ లో రవళి (పేరు మార్చాము) అనే యువతి పరిచయమైంది. అయితే రవళి కూడా గవర్నమెంట్ జాబ్ కోసం సన్నద్ధమవుతోందని ప్రమీలకు పేస్ బుక్ లో చాటింగ్ చేస్తుంటే తెలిసింది.. అంతేకాకుండా
రవళి హైదరాబాద్ లో ఉండి చదువుకునేంత పరిస్థితి లేకపోవడంతో.. ఊర్లోనే ఉండి చదువుకుంటోంది.. అయితే.. రవళి చదువుకు సహాయం చేద్దామని.. రవళి వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేందుకు తిలక్ ను ప్రమీల ఒప్పించింది.
రవళి పరిస్థితి తెలిసి తిలక్ కూడా సరే చెప్పాడు. దీంతో కొన్ని రోజుల నుంచి తిలక్, ప్రమీలతో రవళి కలిసుంటూ ప్రిపేర్ అవుతోంది. అయితే కొన్ని రోజుల తరువాత.. తిలక్, ప్రమీలను కూర్చోబెట్టి నేను కూడా తిలక్ ను పెళ్లి చేసుకుంటానని.. అందరం కలిసి ఉందామనడంతో ఆ భార్యభర్తలు షాక్ తిన్నారు. అయితే.. తిలక్, ప్రమీల లు రవళికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో.. రవళి తల్లిదండ్రులను పిలిపించి.. వారికి రవళి విషయం చెప్పారు.. రవళి తల్లిదండ్రులు కూడా.. తాను పెళ్లి చేసుకుంటానంటుంది కదా.. చేసుకోండి అని వెళ్లిపోయారు.. దీంతో ఖంగుతిన్న తిలక్, ప్రమీల లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం చూసిన పోలీసులు తెలియని వారికి ఆశ్రయమిచ్చి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవద్దని సూచించారు.