మరికొన్ని గంటల్లో పెళ్లి..గుండెపోటుతో వధువు మృతి..అయినా ఆగని విహహం

-

ఈరోజుల్లు గుండెపోటు వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తుంది.. ఎప్పుడు ఎలా అనేది చెప్పలేకున్నాం.. అప్పటి వరకూ బానే ఉంటారు.. ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు. పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అత్తింటిలో అడుగుపెడదాం అనుకున్న వధువు గుండెపోటుతో పెళ్లిరోజో చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో కదా..! అయితే ఇక్కడ పెళ్లి కూతురు చనిపోయినా పెళ్లి మాత్రం ఆగలేదు.. అదేలా అనుకుంటున్నారా..?
మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా వధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుజరాత్‌లోని భావ్ నగర్‌కు చెందిన బాకాభాయ్ రాథోడ్‌కు ఇద్దరు కుమార్తెలు.. ఒక కొడుకు. పెద్ద కూతురికి, కుమారునికి ఇటీవల సంబంధాలు చూసి పెళ్లి చేయాలనీ నిశ్చయించారు. ఈ క్రమంలో ముందుగా పెద్ద కూతురు హెతల్‌కు నారీ గ్రామానికి చెందిన విశాల్ భాయ్‌తో పెళ్లి చేయాలని భావించి..ఈనెలా 23న ముహూర్తం ఖరారు చేశారు.
ఇక పెళ్ళికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. ఇళ్లంతా పెళ్లి సందడి..పెళ్లి కొడుకు కూడా తన గ్రామం నుంచి వధువు ఇంటికి బారాత్ ద్వారా వచ్చేశాడు.. కానీ ఉన్నట్టుండి వధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనితో వధువును హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగా మృతి చెందిందని నిర్ధారించారు. దీనితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
కానీ ఇలాంటి సమయంలో వధువు తల్లిదండ్రులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. తమకున్న రెండో కుమార్తెను వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తామని వధువు తల్లిదండ్రులు వరుడు కుటుంబసభ్యులను ఒప్పించారు. గుండెపోటుతో మృతి చెందిన హెతల్ ను మార్చురీలో భద్రపరిచి..చిన్న కుమార్తెతో నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లి చేశారు. అసలు ఈ సీన్ సినిమాల్లో కూడా ఉండదేమో కదా.. తలచుకుంటేనే చాలా బాధగా ఉంటుంది. ఓ పక్క అక్క శవం..మరోపక్క పెళ్లి.. ఆ చెల్లెల్లి కష్టం వర్ణణాతీతం..! ఆమెకు అసలు పెళ్లి చేసుకునేది ఇష్టం ఉందోలేదు.. ఇక చేసేదేం లేక తండ్రిమాటకు తలఒంచి ఉండొచ్చు.. విచిత్రం కాకపోతే.. భార్య కావాల్సిన అమ్మాయి శవం అవడం ఏంటి.. మరదలు కావాల్సిన అమ్మాయి భార్య అవడం ఏంటో..

Read more RELATED
Recommended to you

Latest news