చంద్రబాబుపై క్రిమినల్ కేసు!

-

అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదు చేశారు. న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. ఎన్-440కే వైరస్ పేరిట చంద్రబాబు సామాన్యులను భయాందోళనకు చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుపై 188, 505 (1)(బీ)(2) కేసు నమోదు చేశారు. 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టం సెక్షన్ -54 కింద కేసు ఫైల్ అయింది. త్వరలో చంద్రబాబును విచారిస్తారని తెలుస్తోంది. తమ విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా జగన్ వీడియోను మార్ఫింగ్ చేశారని ఇటీవల కాలంలో దేవినేని ఉమపై కూడా కర్నూలుకు చెందిన న్యాయవాది సీఐడీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దేవినేని ఉమను విచారిస్తున్నారు. దేవినేని ఉమ వాడిన ట్యాబ్‌ను గుర్తించే పనిలో పడ్డారు.

ఇక ఇటీవల కాలంలో టీడీపీ నేతలపై కేసులు ఎక్కువయ్యాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా మాజీ మంత్రులు ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్రపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందునే తమపై కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు, శ్రేణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news