ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏపీ రైతులకు పంట రుణ పరిమితి పెంచుతూ… నిర్ణయం తీసుకుంది. వచ్చే ఖరీఫ్ వరి సాగుకు 42 వేల రూపాయలు… రబీలో 45 వేల రూపాయలు చొప్పున గరిష్టంగా రుణాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది అధ్యక్షతన జరిగిన భేటీలో జిల్లాల వాతావరణ పరిస్థితులు మరియు సాంకేతిక కమిటీలు తయారుచేసిన రుణ పరిమితులపై చర్చించారు. 202-24 సంవత్సరానికి సగటున 15% నుంచి 20 శాతం వరకు పెంచాలని… ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.