టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిపై ఎన్నికల కమిషన్ సీరియస్‌

-

టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కి బిగ్ షాక్ తగిలింది.ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల రోజున ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నేత, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విశాఖలో ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీరియస్‌ అయ్యారు. మహారాణిపేట తహసీల్దార్‌ ఆనందకుమార్‌, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బండారు రమణమూర్తిలకు షోకాజ్‌ జారీ చేశారు.

ఈనెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరిగింది. ఆ రోజు స్థానికేతర నేతలు నగరంలో ఉండకూడదని ఎన్నికల ప్రవర్తనా నియామవళి స్పష్టం చేస్తోంది. సుబ్బారెడ్డి నగరంలో ఉండడంతోపాటు అక్కయ్యపాలెం పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లడంపై టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇద్దరు అధికారుల నుంచి ఇంకా వివరణ రాలేదని తెలిసింది. కాగా, ఎన్నికల కోడ్‌ ఆదివారంతో ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అఽధికారి నుంచి సమాచారం వచ్చింది. పోలింగ్‌, కౌంటింగ్‌ ముగియడం తో నివేదికను కలెక్టర్‌ మల్లికార్జున, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కి పంపారు.

Read more RELATED
Recommended to you

Latest news