ఈ తెల్లవారుజామున జరిగిన సజీవ దహనం కేసులో అనేక మలుపులు తిరుగుతోంది. విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగిందన్న ఆయన ఇంట్లో మంటలు వ్యాపించడానికి రెండు గంటల ముందు ఘర్షణ జరిగినట్లుగా అపార్ట్మెంట్ లోని లేడీ తెలిపారని అన్నారు. తలుపులు పగలగొట్టి చూస్తే నలుగురు చనిపోయారని అన్నారు. సీసీ కెమెరా విజువల్స్ కూడా పరిశీలిస్తున్నామన్న ఆయన పెద్ద కుమారుడు దీపక్ NIT చదువుతూ ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నారని అన్నారు.
కుటుంబ కలహాలే ఘటనకు కారణమని తెలుస్తుందని అంటున్నారు. పెద్ద కుమారుడికి, మిగిలిన వారికి మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామమని అన్నారు. అయితే పెద్ద కుమారుడు కి మినహా ముగ్గురికి గాయాలు ఉన్నాయని, పెద్ద కుమారుడు వారిపై దాడి చేసినట్లుగా తెలుస్తోందని ఆయన అన్నారు. పెద్ద కుమారుడు ఒక దగ్గర మిగిలిన ముగ్గురు ఒక దగ్గర పడి ఉన్నారని పేర్కొన్నారు. కారణం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్న ఆయన పెద్ద కుమారుడికి మానసిక సమస్య ఉన్నట్లుగా తెలుస్తోందని అన్నారు.