బండి సంజయ్ ఇది గ్రహించాలి ముందు

-

తెలంగాణలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో ఆ పార్టీ నేతలు చాలావరకు సానుకూలంగా ఉన్నా సరే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం తప్పులు ఎక్కువగా జరుగుతున్నాయనే భావన ఉంది. కొన్ని అంశాల్లో బండి సంజయ్ దూకుడుగా ముందుకు వెళ్ళడంతో ఎక్కువగా బీజేపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నాగార్జునసాగర్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర స్థాయి నేతలతో చర్చలు జరపకుండా కేవలం కేంద్ర స్థాయి నేతలతో చర్చలు జరిపారు.

దీనితో ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయని రాష్ట్రంలో ప్రజాదరణ ఉన్న కొంతమంది నేతలను వాడుకునే విషయంలో బండి సంజయ్ కి సరిగా వెళ్లడం లేదని అంటున్నారు. కొంత మంది నేతలను ప్రచారానికి ఆహ్వానించే విషయంలో కూడా బండి సంజయ్ తప్పులు ఎక్కువగా చేయడంతో కొంత మంది నేతలలో ఆగ్రహం పెరిగిపోతుందనే భావన వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఒక పార్టీకి ఎంత వరకు కూడా ఇది మంచి పరిస్థితి కాదు.

అందుకే ఇప్పుడు బండి సంజయ్ విషయంలో కొంతమంది నేతలు సీరియస్ గా ఉన్నారని కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడానికి కూడా వరకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. బండి సంజయ్ భవిష్యత్తులో ఇదే విధంగా ముందుకు వెళితే మాత్రం బిజెపి ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉంది అనే విషయం గ్రహించాలి.

Read more RELATED
Recommended to you

Latest news