మున్సిపల్ ఎన్నికల మీద నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్ ?

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో 30వ తేదీన జరుగుతున్న కార్పొరేషన్ , మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం పలు ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రచారం సమయాన్ని కుదించిన ఎస్ఈసీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన కరోనా నిబంధనలు పాటిస్తూ రాత్రి 8 గంటలకు ప్రచారం ముగించాలని పేర్కొంది.

ఎన్నికల ప్రచారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు చేసుకోవచ్చని పేర్కొంది. బహిరంగ సభలో, లౌడ్ స్పీకర్లు వినియోగం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమేనని ప్రచారంలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. రోడ్ షో లు, బహిరంగ సభలకు లౌడ్ స్పీకర్స్ అనుమతి ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అని. మిగతా టైం లో ఉదయం 10 నుండి 6 గంటల వరకు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news