ప్రభుత్వ చర్యలేవీ… హైకోర్టు సీరియస్

-

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హై కోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. జన సంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. కాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో జన సంచారం తగ్గించేందుకు ప్రభుత్వ చర్యలేవీ అని ప్రశ్నించిన హైకోర్టు… ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఉండటం లేదని సీరియస్ అయింది.

సినిమా హాళ్లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. పబ్బులు, వైన్ షాపులే ముఖ్యమా? అని నేరుగా ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ తరపున న్యాయవాది స్పందిస్తూ జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని సమాధానం ఇవ్వగా… ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని మండిపడింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేకా ఆదేశాలు ఇవ్వమంటారా? అని సీరియస్ అయింది. కాగా తెలంగాణలో ఆదివారం కొత్తగా 4,009 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,55,433కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news