CURFEW : ఏపీలో మరోసారి క‌ర్ఫ్యూ పొడిగింపు…

-

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌ లో నైట్ క‌ర్ఫ్యూను పొడిగిస్తూ జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కార్‌ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం… రాష్ట్రంలో రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొనసాగనుంది. వ‌చ్చే నెల 14 వ‌ర‌కు ఆంధ్ర ప్రదేశ్‌ లో ఈ నైట్‌ క‌ర్ఫ్యూ ఆంక్షలు అమలు కానున్నాయి.

ఇక క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ఎవరైనా… ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్యలు తప్పవని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది ఏపీ సర్కార్‌. కాగా… ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2107 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,59,154 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 20 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,332 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,279 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news