అమరావతి అరటితోటలను గుర్తుచేస్తున్న విశాఖ ఫ్యాక్టరీలు… పాపం ఎవరిది?

-

2014లో రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వని రైతుల అరటి తోటలు తగులబెట్టపడిన సంగతి తెలిసిందే. ఆ నేరం వైకాపాపై వేసే పనికి బలంగా పూనుకున్నారని.. ఆ ముద్ర వైసీపీపై వేయాలని బలంగా ప్లాన్స్ చేశారనేది తెలిసిన విషయమే! సరిగ్గా ఇదే ఆలోచనతో నేడు విశాఖలో ఫ్యాక్టరీలలో పేలుళ్లు సృష్టిస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైకాపా నేతలు! చంద్రబాబు మార్కు రాజకీయం ఇలానే ఉంటుందని… “ఆస్తులు అగ్నికి ఆహుతవ్వాలి – ప్రజల ప్రాణాలు పోవాలి… వాటిపై రాజకీయ పేలాలు ఏరుకొవాలి” అనే దిశగా చంద్రబాబు ఆలోచిస్తుంటారని ఆరోపిస్తున్నారు వైకాపా ఎమ్మెల్యేలు!

రాజధాని ప్రాంత రైతుల అరటి తోటలు తగులబడిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.. సరిగ్గ ఇదే పద్దతిలో నేడు విశాఖలోని ఫ్యాక్టరీలలో పేలుళ్లు సంభవిస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయని… విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బకొట్టేలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఫైరవుతున్నారు వైకాపా నేతలు! తాజాగా ఈ విషయాలపై స్పందించిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్… విశాఖలో జరుగుతున్న ప్రమాధాల విషయంలో కుట్ర కోణాలు ఉన్నాయేమోనని అనుమానాలు ఉన్నాయని.. ఈ వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్‌ ను కోరుతున్నానని చెబుతున్నారు.

ఇదే క్రమంలో… ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు గాని, టీడీపీ నేతలు గానీ స్పందించిన తీరు చూస్తే… విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ కొట్టి, రాజధాని రాకుండా ఆలోచన చేస్తున్నారనే భయం కలుగుతోందని అన్నారు. ఎప్పుడు మాట్లాడని లింగమనేని బ్రదర్స్ ఫార్మా సిటీ ఘటన పై మాట్లాడిన తీరు చూస్తుంటే ఏదో కుట్ర ఉందేమో అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. పైగా బాబు మార్కు రాజకీయాలు ఇలానే ఉంటాయని అంటూ… నాటి అరటి తోటల మంటలతో పాటు… దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసిన “మనసులో మాట” పుస్తకంలోనే… ఉద్యమం చేయాలంటే 4, 5 బస్సులు తగలబెట్టాలని స్వహస్థలతో చంద్రబాబు నైజాన్ని వ్యక్తపరిచిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు!

కాగా… విశాఖలో పేలుళ్లు సంభవించిన వెంటనే… టీడీపీ సోషల్ మీడియా వేదికగా… “విశాఖ సేఫ్ ప్లేస్ కాదు.. కార్యనిర్వాహక రాజధానికి పరికిరాదు” అంటూ పోస్టులు పడుతున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news