ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో ‘పవర్‌ స్టార్‌’ రిలీజ్‌..! కాకపోతే..?

-

సంచలన దర్శకుడు రామ్ ‌గోపాల్‌ వర్మ రూపొందిస్తున్న ‘పవర్‌ స్టార్‌’ సినిమాకు సంబంధించిన మరో స్టిల్‌‌ ను ఆయన విడుదల చేశారు. ‘ప్రవన్ ‌కల్యాణ్‌ నటిస్తున్న మెగా మూవీ పవర్ ‌స్టార్‌ను ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో విడుదల కాబోతుంది’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేగాకుండా తన హీరో ప్రవన్ ‌కల్యాణ్‌ అద్భుతమైన నటుడని, ఇతర స్టార్‌ లతో పోలిస్తే ఎంతో పవర్‌ ఫుల్‌ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే త్వరలోనే ‘పవర్ స్టార్’ ట్రైలర్ వదలబోతున్నాడు వర్మ. కానీ అందరిలా దాన్ని యూట్యూబ్‌లో ఫ్రీగా చూపించేయట్లేదు.

ఆ ట్రైలర్ చూడటానికి కూడా రేటు పెడుతున్నాడట. రూ.50 దాకా డబ్బులు పెడితే తప్ప ఆ ట్రైలర్ చూడలేరట. ప్రపంచంలో ఇలా ట్రైలర్‌ ను కూడా అమ్మకానికి పెట్టిన తొలి ఫిలి మేకర్ వర్మే కావచ్చు అని సినీ ప్రేక్షకులు నవ్వుకుంటున్నారు. ఇకపోతే ఇందులో పీకే, ఎమ్‌ఎస్, ఎన్‌బీ, టీఎస్, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ ముఖ్య పాత్రలు చేయనున్నారు. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవడానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు’’ అని ట్విటర్‌ వేదికగా ఈ సినిమాని వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news