సంవత్సరంలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉందన్న విషయం తెల్సిందే. అయితే కొన్ని రోజులలో ఒక రోజుకు రెండు మూడు ప్రత్యేకతలు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా చూసుకుంటే ఈ రోజు వరల్డ్ డాక్టర్స్ డే మరియు వరల్డ్ ఇడ్లీ డే కూడా కావడం విశేషం. చాలామందికి ఇడ్లీ డే ఉందన్న విషయం కూడా తెలిసే అవకాశం లేదు. అయితే ఈ ఇడ్లీ దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ “SWIGGY” ఒక విషయాన్ని రివీల్ చేసింది. మాములుగా ఎవరైనా ఢిల్లీ తింటే రోజుకు మాక్సిమం 10 ఇడ్లీలు తినే అవకాశం ఉంది.
ఆ లెక్కన చూసుకుంటే సంవత్సరానికి 3650 ఇడ్లీలు మాత్రమే ఆర్డర్ చేయగలడు. కానీ హైదరాబాద్ చెందిన ఒక కస్టమర్ ఏకంగా ఒక సంవత్సరానికి రూ. 6 లక్షల ఇడ్లీలు.. అంటే 8428 ప్లేట్ ల ఇడ్లీలు ఆర్డర్ చేశాడట. ఇది తెలిసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. కాగా మొత్తం మీద “SWIGGY ” డెలివరీ సంస్థ ఒక సంవత్సర కాలంలో 3 .3 కోట్ల ప్లేట్ ల ఇడ్లీలు అమ్ముడుపోయాయట.