చైల్ దేశంలో ఒక 53 ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ రోగికి తీవ్రమైన ఇన్‌ఫ్లూఎంజా లక్షణాలున్నట్లు తెలిపింది. తన ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇప్పుడు నిలకడగా ఉన్నట్లు సమాచారం. మనిషిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. చైల్ లో తొలి కేసు నమోదు కావడం అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. . ఆ రోగికి తీవ్రమైన ఇన్‌ఫ్లూఎంజా లక్షణాలున్నట్లు వెల్లడించింది. దేశంలో తొలిసారి మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్ ఎలా వ్యాపించిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఈ వైరస్ పక్షులు లేదా సముద్రపు క్షీరదాల నుంచి మానవులకు సంక్రమించి ఉంటుందని చైల్ ఆరోగ్య అధికారులు అనుకుంటున్నారు.
అయితే మానవుల నుంచి మానవులకు బర్డ్ ఫ్లూ వ్యాపించడాన్ని ఇప్పటి వరకు అసలు జరిగినట్లు చరిత్రలో లేదని తెలిపారు అధికారులు. కాగా, బర్డ్ ఫ్లూ సోకిన రోగితో కాంటాక్ట్ అయిన ఇతర వ్యక్తులను కూడా ట్రాక్ చేస్తున్నట్లు చైల్ ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది చివరిలో అటవీ జంతువుల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలియచేసింది. దీంతో పౌల్ట్రీ ఎగుమతులను నిలిపివేసినట్లు తెలిపింది. మరోవైపు అర్జెంటీనా సహా 14 లాటిన్ అమెరికా దేశాలలో కూడా మనుషుల్లో బర్డ్ ఫ్లూ కేసులు వచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో ఈక్వెడార్‌కు చెందిన 9 ఏళ్ల బాలికలో మానవ సంక్రమణ బర్డ్ ఫ్లూ కేసును గుర్తించారు.