గుజరాత్ లో బీభత్సం సృష్టిస్తున్న వాయు తుపాను.. 3 లక్షల మంది తరలింపు

-

వాయు తుపాను ఇవాళ మధ్యాహ్నం వరకు గుజరాత్ లో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వెరావల్ – ద్వారక మధ్య అది తీరం దాటే అవకాశం ఉంది. అది తీరం దాటితే మాత్రం 150 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

హుద్ హుద్, తిత్లీ, ఫొని తుపాన్లు సృష్టించిన బీభత్సం చూశాం కదా. ఇప్పుడు వాయు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. గుజరాత్ వైపు దూసుకొస్తోంది. పెను తుపానుగా మారిన వాయు గుజరాత్ వైపు దూసుకువస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యలను గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించింది. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో వాయు తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దీంతో ఆ ప్రాంతాల్లోని 10 జిల్లాకు చెందిన 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతాల్లోని అన్ని ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

వాయు తుపాను ఇవాళ మధ్యాహ్నం వరకు గుజరాత్ లో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వెరావల్ – ద్వారక మధ్య అది తీరం దాటే అవకాశం ఉంది. అది తీరం దాటితే మాత్రం 150 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కుండ పోత వర్షం కురుస్తుంది. దీని వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉంది. అందుకే.. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కచ్, మోర్బి, జామ్ నగర్, జునాగఢ్, దేవ్ భూమి – ద్వారక, పోర్ బందర్, రాజ్ కోట్, అమ్రేలి, భావ్ నగర్, గిర్ – సోమనాథ్ జిల్లాలపై వాయు తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే 52 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం దీవ్ లో 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇతర సహాయక బృందాలు కూడా గుజరాత్ కు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దుతున్నాయి.

తీర ప్రాంతాల్లోని ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లను మూసేశారు. విమాన సర్వీసులు, రైళ్లను కూడా రద్దు చేశారు. తీరంలోని నౌకాశ్రయాలను కూడా మూసేశారు.

Read more RELATED
Recommended to you

Latest news