కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. వచ్చే నెల నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచనున్నట్లు కీలక ప్రకటన చేయనుంది. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు జూలై నెలలో అమలు చేయనున్నట్లు సమాచారం. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) ఆధారంగా కేంద్రం జనవరి, జూలై నెలలో డీఏను సవరిస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు వేతనాల పెంపునకు సంబంధించి వచ్చే నెలలో కీలక ప్రకటన చేయనుంది.
ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం 7వ వేతన సంఘం కింద డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌లు 3 శాతం పెరిగాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఏఐసీపీఐ 126 కంటే ఎక్కువగా 4 శాతం పెరగనుంది. ఆ స్థాయిలోనే డీఏ కొనసాగితే.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాథమిక వేతనంపై 34 శాతం డీఏ పొందుతారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న డీఏ రేటును ఉద్యోగి ప్రాథమిక వేతనంతో గుణించడం ద్వారా 38 శాతం డీఏ లభిస్తుంది. అంటే 31 శాతం డీఏ చొప్పున రూ.6,120 డీఏ పొందవచ్చు.