వారియర్ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్‌ పోతినేని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. స్టైలిష్ గా కనిపిస్తూనే… మాస్ పాత్రలతో అలరించే హీరో రామ్ పోతినేని. దర్శకుడు లింగుస్వామి కూడా సినిమాలకు పెట్టింది పేరు. ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు ది వారియర్‌ అనే టైటిల్‌ ను ఇటీవలే అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. అయితే… ఈ సినిమాలో ఉప్పెన తో ఆకట్టుకున్న కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఊర మాస్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది సినీ బృందం.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా దడ దడా అనే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ సాంగ్ లో హీరో రామ్, కృతి శెట్టి అదరగొట్టాడు. కాగా.. వారియర్‌ మూవీ.. జూలై 14 వ తేదీన విడుదల కానుంది.

 

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version