దాస్తున్న చైనా…3 వేల మంది కాదు,40 వేలమందట…!!

-

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనా లోని వూహన్ పట్టణంలో పురుడు పోసుకున్న విషయం తెలిసిందే. మొట్ట మొదటిగా కరోనా అనే వైరస్ ఒకటి ఉందని,అది ప్రాణాలను ఈ స్థాయిలో హరిస్తుంది అన్న విషయం ఆ రోజు తెలియలేదు. కానీ ఆ తరువాత విజృంభించిన ఈ కరోనా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తుంది. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి కి ప్రపంచ వ్యాప్తంగా 30 వేల మంది మృతి చెందగా వారిలో మూడు వేల మూడు వందల మంది ఒక్క చైనా లోనే మృతి చెందినట్లు అక్కడి అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే అక్కడ వాస్తవానికి మరణాలు చాలా ఎక్కువ ఉన్నాయని మూడు వేలు కాదు, నలభై రెండు వేలకు పైగా ప్రాణాలు కోల్పోయినట్లు డైలీ మెయిల్ ఒక కధనాన్ని ప్రచురించింది. అయితే చైనా అధికారిక లెక్కలు ప్రకారం చూసుకుంటే కేవలం మూడు వేల మూడు వందల మంది మాత్రమే మృతి చెందడం పై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అమెరికా, ఇటలీ,స్పెయిన్ దేశాల్లోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని గణంకాలు చెబుతుండగా, అసలు ఈ వైరస్ పుట్టిన చైనా లో ఇంత తక్కువ ఎలా నమోదు అయ్యింది అనేది ఒక పెద్ద మిస్టరీ గామారింది. ప్రపంచం అంతా దీనిపైనే చర్చించుకుంటున్న సమయంలో ప్రముఖ మీడియా ‘డైలీ మెయిల్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. అక్కడ ఈ వైరస్ ఇప్పటికే 7 లక్షల మందికి సోకిందని డైలి మెయిల్ చెబుతోంది. మరణాల సంఖ్య 42 వేలకు చేరి ఉంటుందని అంచనా వేస్తూ కథనాన్ని రాసింది. స్థానిక ప్రజలు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. మృతుల్లో 3,182 మంది హుబీ ప్రావిన్స్ వారే ఉంటారని అంటున్నారట. దీనికి ఆధారాలను కూడా జోడించింది. హుబీ ప్రావిన్స్‌లో 7 అంత్యక్రియల వేదికలు ఉండగా, అక్కడి నుంచి రోజుకు 500 ఆస్థికల కలశాలను వారి బంధువులకు ఇస్తున్నారట. ఈ విధంగా రోజుకు 3,500 మంది మృతుల అస్థికలను ఉంచిన కలశాలను ప్రజలకు ఇస్తున్నారని పేర్కొంది.

ఈ విధంగా 12 రోజుల్లో దాదాపు 42 వేల అస్తికలు కలశాలను వారి వారి బంధువులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చైనాలో అసలు ఏం జరిగిందన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు చైనానే ఈ వైరస్‌ను ప్రపంచంపై వదిలిందంటూ కూడా పలుదేశాలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యాధినేత ట్రంప్ కూడా కరోనా వైరస్ ను చైనా వైరస్ అనే సంబోధిస్తున్నారు. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా లో ఈ వైరస్ క్రమేణా తగ్గుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి డైలీ మెయిల్ కధనం వాస్తవమా అనేది మాత్రం తెలియడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news