సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న బన్నీ పోస్టర్…మేడ్ ఫ్రమ్ ఫ్యాన్

-

కొంతమందికి అభిమానం హద్దులు దాటి పోతూ ఉంటుంది. తమ అభిమాన హీరో కోసం ఎదో చేయాలి అని చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి అభిమానానికి హీరో లు సైతం ఫిదా అయిపోతూ ఉంటారు. అల..వైకుంఠపురం చిత్రం తో టాలీవుడ్ లో మళ్లీ ఒక సాలిడ్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో అందరికీ తెలిసిందే. ఆయనకు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మళయాళం లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాంటి స్టైలిష్ స్టార్ బన్నీ అల వైకుంఠపురం తరువాత సుకుమార్ తో ఒక ప్రాజెక్టుకు ఒకే చెప్పిన విషయం తెలిసిందే. అయితే అన్ని బాగుండి ఉంటే ఈ పాటికి ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లిపోయేది. ఆర్య,ఆర్య-2 వంటి మంచి హిట్ చిత్రాలను అల్లు అర్జున్ ఖాతాలో వేసిన సుకుమార్ తో బన్నీ మరో చిత్రం చేయనున్నాడు అనగానే బన్నీ అభిమానులు తెగ సంబరాలు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ మూవీ పై భారీ అంచనాలు కూడా ప్రారంభమయ్యాయి. అలానే ఈ చిత్రం రంగస్థలం చిత్రం తరువాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా అలానే పల్లెటూరు బ్యాక్ డ్రాప్ తో ఉంటుంది అని,బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు అంటూ తెగ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇంకా కరోనా కారణంగా సెట్స్ పైకి వెళ్లిన ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ జట్టు వెన‌క్కి దువ్వి, గుబురు గబ్బంతో ఎప్పుడూ లేనంత మాస్ లుక్‌లో దుమ్ము రేపుతున్నాడు. అయితే ఇది ఫ్యాన్ మేడ్ పోస్టరత. ప్రస్తుతానికి ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అయితే ఈ పోస్టర్ చూస్తుంటే ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుంది.

ఇదే అఫిషియల్ పోస్టర్‌ ఏమో అనే అనుమానాలు కూడా క‌లుగుతున్నాయి. సినిమాలో అల్లు అర్జున్… లారీ డ్రైవర్‌ గెటప్‌లో కనిపిస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తోన్న నేప‌థ్యంలో ఈ పోస్టర్ లో బన్నీ లుక్ కూడా అదే మాదిరిగానే డిజైన్ చేశారు. కోపంగా చూస్తున్న హీరో గెటప్ చూస్తే ఇది ఖచ్చితంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కతున్న సినిమా అనే ఒక కన్ఫర్మేషన్ కు రావచ్చు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. బన్నీ చాలా గ్యాప్ తరువాత దేవి తో కలిసి చేస్తున్న ప్రాజెక్ట్. తప్పకుండా ఇది మ్యూజికల్ హిట్ గా నిలుస్తుంది అని కూడా ఇండస్ట్రీ లో టాక్.

Read more RELATED
Recommended to you

Latest news