ఇలా చుండ్రుని తరిమికొట్టేయండి..!

-

చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడతారు. చుండ్రు ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ టిప్స్ ఫాలో అయితే సులువుగా బరువుని తరిమికొట్టొచ్చు. పైగా దీని కోసం మీరు అంత పెద్దగా కష్టపడక్కర్లేదు. సులువైన పద్ధతులని ఉపయోగించి చుండ్రు సమస్య నుండి బయట పడచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూద్దాం.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె మన ఇంట్లోనే ఉంటుంది. రెగ్యులర్ గా చాలా మంది కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు. అయితే కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. అదేవిధంగా జుట్టు దృఢంగా ఉంటుంది.

అలోవెరా:

కలబంద కూడా చుండ్రును తగ్గిస్తుంది. అలోవెరా లో కొద్దిగా టీ ట్రీ ఆయిల్ వేసుకుని జుట్టు కి అప్లై చేసుకుంటే చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. జుట్టు కూడా ఒత్తుగా ఎదుగుతుంది. బలంగా ఉంటుంది.

టీ ట్రీ ఆయిల్:

టీ ట్రీ ఆయిల్ కూడా చుండ్రుని తరిమికొడుతుంది. రెగ్యులర్ గా మీరు తలకి టీ ట్రీ ఆయిల్ ను అప్లై చేసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది.

బేకింగ్ సోడా:

చుండ్రు సమస్య తగ్గించడానికి బేకింగ్ సోడా కూడా ఉపయోగపడుతుంది. తడి జుట్టు మీద బేకింగ్ సోడాని అప్లై చేసుకుని ఆ తర్వాత షాంపూతో హెయిర్ ని వాష్ చేసుకోండి ఇలా చేయడం వల్ల చక్కటి ఫలితం కనబడుతుంది. చుండ్రు కూడా పూర్తిగా తగ్గిపోతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి వంటి ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇది చుండ్రును తగ్గిస్తుంది. వెల్లుల్లి లో నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకుని దానిని తలకు పట్టిస్తే చుండ్రు పూర్తిగా తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news