అయోధ్య బాలరాముని దర్శనం.. రోజూ గంట విరామం: ట్రస్ట్‌ కీలక నిర్ణయం

-

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం లో బాల రాముడి రూపంలో కొలువుదీరిన శ్రీరాముని దర్శించుకోవటానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. బాలరాముడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిట కిటలాడుతుంది.దేశ, విదేశాల నుంచి వస్తుండడంతో ఇప్పటికే ఆలయ దర్శన వేళల్లో మార్పు చేసిన ట్రస్టు….తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

 

ఈ మేరకు బాలరాముడి దర్శనానికి రోజూ గంట పాటు విరామం ఇవ్వనున్నట్లు ఆలయ ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ తెలిపారు. దీంతో బాల రాముడికి విశ్రాంతి ఇచ్చేలా శుక్రవారం నుంచి రోజూ మధ్యాహ్నం 12.30-1.30 గంట వరకు ఆలయ ద్వారాలు మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయించింది.రామ్‌లల్లా ఐదు సంవత్సరాలు బాలుడు కావడం వల్ల  ఇన్ని గంటల పాటు మెలకువగా ఉంటే తట్టుకోలేరు. బాల రాముడికి కొంత విశ్రాంతి ఇచ్చేందుకు రోజూ గంట సేపు తలుపులు మూసివేస్తారు . దీంతో దేవతామూర్తికి విశ్రాంతి దొరుకుతుంది” అని ఆచార్య సత్యేంద్ర దాస్‌ పేర్కొన్నారు. స్వామి వారికి సుప్రభాత సేవా కార్యక్రమాలు తెల్లవారుజామున 4 గంటలకి, ఆ తర్వాత ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తజనాన్ని రాములోరి దర్శనం కోసం అనుమతిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news