మేడారం జాతర వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

-

మేడారం భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభ వార్త అందించింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆదివాసీ జాతర అయిన మేడారం సమ్మక్క సారక్క జాతరకు 3 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. అబిడ్స్‌లో రామ్‌జీ గోండ్ మెమోరియల్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం ఏర్పాటుకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దనసరి అనసూయ (సీతక్క) కూడా ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.అలాగే కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

 

రామ్‌జీ గోండ్‌ పేరిట ఈరోజు గిరిజన స్మారక మ్యూజియానికి భూమిపూజ చేస్తున్నామని తెలిపారు. ఆదివాసీల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ 285వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడి గిరిజనులు చాలా మంది అమరులయ్యారన్నారు అని గుర్తు చేశారు. భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా నవంబర్ 15వ తేదీని జనజాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించడం ద్వారా గిరిజన సంప్రదాయాలను గౌరవించింది బీజేపీ ప్రభుత్వమేనని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news