ఇండియా వేదికగా ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్ కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఐపీఎల్ లో తెలుగు రాష్ట్రము తరపున ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న టీం సన్ రైజర్స్ హైద్రాబాద్.. ఇది ఐపీఎల్ లో ఎంటర్ అయ్యాక కేవలం ఒక్క సారి మాత్రమే టైటిల్ ను అందుకుంది. ఆ తర్వాత అన్నీ ఘోరపరాజయాలు కావడం గమనార్హం. ఇక ఈ సంవత్సరం ఐపీఎల్ లోనూ అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. దానితో SRH యాజమాన్యం ఒక కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఆ జట్టుకు కోచ్ ను వెతికే పనిలో పడింది, ఇక తెలుస్తున్న సమాచారమా ప్రకారం ఇండియాకు హిట్టింగ్ ను నేర్పించిన వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ ను కన్సల్ట్ అయిందట. కానీ సెహ్వాగ్ నుండి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. త్వరలోనే సెహ్వాగ్ ఈ విషయంపై పాజిటివ్ గా స్పందిస్తాడని SRH యాజమాన్యం బలంగా నమ్ముతోంది.
కాగా ఇంతకు ముందు సెహ్వాగ్ ఢిల్లీ , పంజాబ్ జట్లకు ఆడాడు.. మరియు పంజాబ్ కు కోచ్ గా కూడా పనిచేసిన అనుభవం ఉంది.