ఎమర్జింగ్ ఆసియా కప్ 2023: 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో టీం ఇండియా … !

-

ఎమెర్జింగ్ ఆసియా కప్ లో భాగంగా జరుగుతున్న రెండవ సెమిఫైనల్ లో ఇండియా మరియు బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియా ఇన్నింగ్స్ సరిగా కొనసాగడం లేదు. బంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వేసిన ఇండియా తగిన మూల్యాన్ని చెల్లించుకుంటోంది. ఇన్నింగ్స్ 35 ఓవర్ లు ముగిసే సమయానికి ఇండియా స్కోర్ 127 పరుగులు మాత్రమే చేసింది. పైగా సగానికి పైగా వికెట్లను కోల్పోయింది, ఓపెనర్లు సుదర్శన్ 21 , అభిషేక్ శర్మ 34 లు పర్వాలేదనిపించినా ఆ తర్వాత ఎవ్వరూ ఆకట్టుకోలేదు.. నికిం జోస్ 17, నిశాంత్ సింధు 5, రియాన్ పరాగ్ 12 మరియు ధృవ్ జుర్ల్ 1 లు విఫలం అయ్యారు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ యాష్ ధూల్ మరియు హర్షిత్ రానాలు ఉన్నారు. బంగ్లాను కట్టడి చేయాలంటే కనీసం ఇండియా రెండు వందల పరుగులు అయినా చేయాల్సి ఉంది, లేదంటే ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

సిరీస్ ఆసాంతం చక్కగా ఆడుతూ వచ్చిన ఇండియా కీలకమైన మ్యాచ్ లో చేతులు ఎత్తేసింది. యాష్ ధూల్ మీదనే భారమంతా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news