శివుడికి విభూది అంటే ఎందుకు ఇష్టమో తెలుసా..?

-

శివ భక్తులని ఎప్పుడు చూసిన విభూది పెట్టుకుని కనిపిస్తారు. ఒళ్ళంతా విభూదితో నామాలు పెట్టుకుని కనిపిస్తారు. కొందరైతే పూర్తిగా శరీరం నిండా విభూది కప్పుకున్నట్టే ఉంటారు. అసలు శివ భక్తులు విభూది నామాలు ఎందుకు పెట్టుకుంటారు. శివుడికి విభూది అంటే ఎందుకు ఇష్టం. దాని వెనక కారణాలేంటో చాలా మందికి తెలియదు. శివుడు విభూది పెట్టుకోవడంపై గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

మనందరికీ క్షీర సాగర మధనం గురించి తెలుసు. పాల సముద్రాన్ని అటు దేవతలు ఇటు రాక్షసులు కలిసి చిలుకుతూ ఉంటారు. అలా చిలుకుతున్నప్పుడు ఒక్కోసారి ఒక్కో వస్తువు సముద్రంలోంచి వస్తూ ఉంటుంది. అలా ఒకసారి కామధేనువు, ఐరావతం ఇలా ఒక్కోటి వస్తూ ఉండగా, తమకి కావాల్సింది ఎవరికి వారు తీసుకుంటూ ఉంటారు. అలా పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే అనుకోకుండా గరళం వస్తుంది. ఆ విషాన్ని ఎవరో ఒకరు తీసుకోవాలి. లేదంటే క్షీర సాగర మధనం ముందుకు సాగదు.

విషాన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడు శివుడు తాను విషాన్ని తీసుకుంటానని వస్తాడు. అలా విషాన్ని గొంతులోకి పోసుకుంటాడు. అలా మొత్తం గరళాన్ని తన కంఠంలో దాచుకుంటాడు. ఐతే ఆ గరళం కారణంగా శివుడి శరీరం వేడెక్కిపోతుంది. వేడెక్కిన శరీరాన్ని చల్లార్చడానికి విభూది పెట్టుకుంటాడు. విభూది చల్లగా ఉంటుంది. విషం వల్ల వేడెక్కిన శరీరం చల్లగా మారడానికి విభూదిని వాడతారు. ఈ కారణం వల్లనే శివుడు విభూదిని ఇష్టపడతాడు.

శివునికి ఇష్టమైన విభూదిని శివభక్తులు ధరిస్తారు. భోళా శంకరుడని చెప్పే శివుడికి భక్తుల సంఖ్య ఎక్కువే. అడగ్గానే అదీ ఇదీ అని చూడకుండా వరాలిచ్చే శంకరుడికి ప్రతీ ఒక్కరూ భక్తులే.

Read more RELATED
Recommended to you

Latest news