తెలుగు తేజం, ఒలిపింక్ పతకాల విజేత పీవీ సింధు తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ బ్మాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పసిడి నెగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సింధుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ట్విటర్ వేదికగా స్పందించాడు. సింధుకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు. ‘‘వెల్‌డన్ సింధు.. అద్భుతమైన విజయం. పరిపూర్ణం’’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలిపింక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. అలానే 2018 కామన్వెల్త్ గేమ్స్ మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం, 2014 కామన్వెల్త్‌లో సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించింది. తాజాగా స్వర్ణం గెలిచిన సింధు ఫైనల్‌లో కెనడా ప్లేయర్ మిచెల్లె లిపై 21-15, 21-13 తేడాతో అలవోకగా విజయం సాధించి పసడిని కైవసం చేసుకుంది. ప్రస్తుత కామన్వెల్త్‌లో భారత్ 61 పతకాలు సాధించి పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 22 స్వర్ణాలు , 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.
Well done @pvsindhu1 amazing achievement, complete. #gold #commgames https://t.co/U2xrEYqTQP
— David Warner (@davidwarner31) August 8, 2022