బుట్టబొమ్మ సాంగ్‌కు చాలామంది సెలబ్రిటీస్ శిల్పా శెట్టి.. జానీ మాస్టారు డ్యాన్స్ చేశారు. ఎవరు వేసినా.. రాని క్రేజ్ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కే వచ్చింది. దేశం కాని దేశం.. భాష కాని భాష. అందులోనూ ఫేమస్ క్రికెటర్ బుట్టబొమ్మకు డ్యాన్స్ వేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రికెటర్ అక్కడితో ఆగలేదు. మార్పింగ్ చేయడం స్టార్ట్ చేశాడు.
నిన్నటివరకు తెలుగు సినిమాలకు స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్‌కు బోర్ కొట్టింది. అల వైకుంఠపురంలోని రాములో రాముల… బుట్టబొమ్మకు సరిలేరునీకెవ్వరులో మైండ్ బ్లాక్‌కు.. జనతాగ్యారేజ్‌లో పక్కా లోకల్ సాంగ్‌కు భార్యతో కలిసి ఆడిపాడాడు. ఆతర్వాత డబ్‌స్మాష్‌లోకి అడుగుపెట్టి పోకిరి.. బాలహుబలి డైలాగ్స్ చెప్పాడు. డేవిడ్‌వార్న్ టిక్‌టాక్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా కారణంగా కొత్త సినిమాలు రాకపోవడంతో… వార్నర్ దృష్టి మార్పింగ్ మీద పడింది.
ఐపిఎల్ తర్వాత డేవిడ్ వార్నర్‌కు ఖాళీ దొరికింది. ఈసారి పాటలకు స్టెప్పులు కాకుండా.. ఎన్టీఆర్ ఆవేశంలో తననితాను చూసుకున్నాడు. అరవింద సమేత వీర రాఘవలో కత్తి పట్టి నెత్తుడి మరకను తొడకు రాసుకునే సీన్‌లోకి మార్ఫింగ్ ప్రవేశం చేశాడు వార్నర్. అలాగే టెక్నాలజీ వాడుకుని బుట్టబొమ్మ సాంగ్‌లో బన్నీని తప్పించి పూజా హెగ్డేతో ఆడిపాడాడు ఈ టిక్‌టాక్ క్రికెటర్.