కరోనా టీకా పరిశోధనలో మరో కొత్త కంపెనీ అడుగు ముందుకు వేసింది. ప్రస్తుతం దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ ఒకటి కాగా, భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్ మరోటి. ఈ రెండు వ్యాక్సిన్లు కరోనాపై మంచి ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మరో కొత్త వ్యాక్సిన్ రాబోతుంది. వ్యాపార రంగంలో ఆకాశానికి ఎక్కిన రిలయన్స్ కంపెనీ ఈ టీకాను తయారు చేస్తుంది.
రిలయన్స్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాకు మొదటి ఫేజ్ లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారతదేశ్ డ్రగ్స్ కంట్రోల్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది. గత నెల 26వ తేదీన దరఖాస్తు చేసుకున్న రిలయన్స్ లైఫ్ సైన్సెస్ కు ఇటీవల అనుమతులు లభించాయి. 135కోట్ల భారతదేశానికి రెండు కరోనా వ్యాక్సిన్లు సరిపోవని చాలామంది విశ్లేషకులు వివరించారు. ఇప్పుడు రిలయన్స్ కూడా తోడైతే మరింత బాగుంటుందని అంటున్నారు.