ఏపీ తెచ్చిన ఫీజు జీవోపై వ్యతిరేకత.. బంద్ కు పిలుపు ఇచ్చిన ప్రైవేటు విద్యాసంస్థలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవోపై వ్యతిరేకత చెలరేగుతుంది. ప్రైవేటు విద్యాసంస్థలు విధించే ఫీజు విషయంలో తీసుకువచ్చిన జీవోనం 53పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ, అందువల్ల ఫీజు విధానంలో అందరూ ఒకేలా ఉండాలన్న విషయంతో జీవీ 53ని తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఐతే ఈ జీవఓపీ ప్రైవేటు విద్యాసంస్థలు మండిపడుతున్నాయి. ఈ జీవో వల్ల తమకు నష్టం కలుగుతుందని ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపు ఇచ్చారు.
ప్రైవేట్ విద్యాసంస్థల అసొసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. 53జీవో వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వం వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని, లేకపోతే నిరసన ఆగదని డిమాండ్ చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.