బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై కేతన కక్కడ్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. పన్వేల్ లోని సల్మాన్ ఖాన్ ఫాంహౌస్ లో సినీ తారల శవాలను ఖననం చేశారని ఆరోపణలు చేశారు. అంతేకాదు… సల్మాన్ ఖాన్ పై చిన్న పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు కూడా చేశాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కేతన్ కక్కడ్ ఈ ఆరోపణలు చేయగా.. సల్మాన్ ఖాన్ అతనిపై కోర్టు లో పరువు నష్టం దావా వేశాడు.
సల్మాన్ ఖాన్ కు మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా పన్వేల్ లో ఫాంహౌస్ ఉంది. ఆ ఫాంహౌస్ పక్కనే కేతన్ కక్కడ్ అనే వ్యక్తికి కొంత భూమి ఉంది. ఆ ఇద్దరికీ ఎక్కడ చెడిందో తెలియదు కానీ కేతన్ కక్కడ్ అనే వ్యక్తి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ పై ఈ సంచలన ఆరోపణలు చేశాడు. సల్మాణ్ ఖాన్ ఫాంహౌస్ పక్కన మరింత భూమిని కొనుగోలు చేయాలనుకున్న కేతన్ కక్కడ్.. అది కుదరకపోవడంతోనే ఇలాంటి ఆరోపణలు చేశాడని చెబుతున్నారు. కాగా.. ఇంతకు ముందే.. కేతన్ కక్కడ్ కు ఈ విషయంలోనే కోర్టు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.