సమంతకు మరో క్రేజీ ఆఫర్. ఊ అంటుందో.. ఊ ఊ అంటుందో చూడాలి

సమంత, నాగచైతన్యతో విడాకులు తర్వాత వరసపెట్టి సినిమాలు చేస్తోంది. ఇటీవల పుష్ప సినిమాలో చేసిన ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా’ ఐటెం సాంగ్ చేసిన సమంత.. ఈ పాటతో సూపర్ డూపర్ హిట్ కోట్టింది. ఈ పాటకు మిలయన్ సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఐటెం సాంగ్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి నెలకొంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్, ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్, సమంత గ్లామర్ ఇలా అన్ని కలిసి ఇండియా లెవల్లో సాంగ్ ఊపేసింది.

ఇదిలా ఉంటే సమంతకు మరోసారి ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ప్యాన్ ఇండియా సినిమా ‘లైగర్’. ఈసినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం సమంతను ఎంచుకోవాలని పూరీ టీం భావిస్తున్నట్లు సమాచారం. సమంతతో విజయ్ దేవరకొండకు ఉన్న స్నేహంతో ఆమెను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఈ క్రేజీ ఆఫర్ కూ సమంత ‘ఊ అంటుందో.. ఊ ఊ అంటుందో’ తెలియాల్సి ఉంది.