పేరెంట్స్ పొరపాటున కూడా పిల్లల ముందు ఇలాంటి పనులు చెయ్యకండి..

-

ఇంట్లో చాలా విషయాల్లో తల్లి దండ్రుల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి..కొంతమంది పేరెంట్స్ ఏ గొడవ జరిగినా పిల్లల ముందుకు తీసుకురారు..అయితే కొందరు తల్లిదండ్రులు మాత్రం తెలియక పిల్లల ముందు గొడవ పడుతుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల ప్రతికూలంగా ప్రభావితమై డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. తల్లిదండ్రుల ఇటువంటి ప్రవర్తన వల్ల పిల్లలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల ముందు అరవడం, కొట్లాడుకోవడం మొదలుపెడతారో అప్పుడే పిల్లలు నిరాశలో మునిగిపోతారు. వారు తల్లి లేదా తండ్రి వైపు వెళ్లలేరు. ఇది వారి నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. వారు మునుపటి కంటే ప్రశాంతంగా ఉండలేరు.. వాళ్ళల్లో కూడా చిరాకు పెరుగుతుంది..తల్లిదండ్రుల గొడవల వల్ల పిల్లలు మానసికంగా కుంగిపోతారు. తమ ఇంట్లో పరిస్థితులు బాగోలేదని వారు నిరాశకు లోనవుతారు. వారికి నిద్రపట్టడంలో ఇబ్బందులు మొదలవుతుంది.. ఎప్పుడు గొడవల గురించి ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు..

పిల్లల మనసులో తిండి తినడం మానేస్తారు. మనసులో ఆహారం పట్ల ఆసక్తి తగ్గుతుంది. వాళ్లు తిన్నా కూడా అయిష్టంగానే తింటారు. తల్లితండ్రుల ఒత్తిడితో నోటిలో ఆహారం పెట్టుకున్నా సరిగ్గా నమలకుండానే మింగేస్తారు. ఇలా తినే ఆహారంపై వారిలో ఆసక్తి తగ్గుతుంది.. ముఖ్యంగా వారితో మాట్లాడటం మానేస్తారు. ఒక్కోసారి ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోతారు.. ఇది గుర్తు పెట్టుకొని పిల్లలతో జాగ్రత్తగా ఉండండి..

Read more RELATED
Recommended to you

Latest news