కేవ‌లం రూ.5,999కే ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్‌డీ స్మార్ట్ ఫోన్

-

ట్రాన్స్‌ష‌న్ ఇండియా కంపెనీ ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్‌డీ 2021 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఆండ్రాయిడ్ 10 గో ఎడిష‌న్ తో వ‌చ్చిన లేటెస్ట్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.1 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. దీంట్లో మీడియాటెక్ హీలియో ఎ20 క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 2జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు ఉన్నాయి. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉండ‌గా.. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు.

Infinix Smart HD 2021 smart phone launched

ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్‌డీ 2021 ఫీచ‌ర్లు…

* 6.1 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1560 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* 1.8 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ హీలియో ఎ20 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్
* 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10 గో ఎడిష‌న్
* డ్యుయ‌ల్ సిమ్‌, 8, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్‌డీ 2021 స్మార్ట్ ఫోన్ టోపాజ్ బ్లూ, క్వార్ట్జ్ గ్రీన్‌, ఆబ్సిడియ‌న్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. రూ.5,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబ‌ర్ 24వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news